‘ మీ అయ్య ఇచ్చాడు కాంట్రాక్ట్ ’.. మేయర్ సంచలన వ్యాఖ్య..!
1 min readపల్లెవెలుగు వెబ్: ముంబయి మేయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి అనూహ్యరీతిలో స్పందించారు. ఆమె సమాధానం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఓ వార్త ఛానల్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి గ్లోబల్ టెండర్ మీద ఓ కథనం ప్రసారం చేసింది. ఆ కథనాన్ని కోట్ చేస్తూ మిఠి రివర్ అనే నెటిజన్ .. ఈ కాంట్రాక్ట్ ఎవరిచ్చారు?
అంటూ .. మేయర్ కిషోరి ఫడ్నేకర్ ను ట్విట్టర్ లో ప్రశ్నించారు. వెంటనే మేయర్ కిషోరీ ఫడ్నేకర్ ‘ మీ అయ్య ఇచ్చాడు ’ అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. నెటిజన్లు మేయర్ వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.