పంచాయతీ రాజ్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల నిరసన !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంట్రాక్టర్లు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, కేంద్రం వాటా 70 శాతం, రాష్ట్ర వాటా 30 శాతమని, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా ఇతర అవసరాలకు మళ్లించారన్నారు. ఇ.యన్.సికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదన్నారు. ఇ.యన్.సి కారణంగా కాంట్రాక్టర్ల వ్యవస్థ దెబ్బ తింటుందని, ఓచర్‌లో బిల్లు ఇచ్చినట్లు చూపిస్తారని, ఎకౌంట్‌లో మాత్రం డబ్బులు జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఇ.యన్.సిని వెంటనే తొలగించాలని, సిఎం జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు.