స్విమ్మింగ్ క్రీడా అభివృద్ధికి సహకారం అందిస్తా.. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్విమ్మింగ్ క్రీడ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్ నందు మాస్టర్ అథ్లెటిక్ స్విమ్మింగ్ పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శరీరంలో ప్రతి అవయవాన్ని ఉత్తేజపరిచే క్రీడా స్విమ్మింగ్ అని అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే అమితాసక్తి అని అందుకే తాను రాజకీయాలకు అతీతంగా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. కర్నూల్ నగరంలో కానీ, చుట్టుపక్కల గ్రామాలలో కానీ నిర్మించిన ఇండోర్, ఔట్డోర్ స్టేడియాలలో తన వంతు భాగస్వామిగా సహకారం అందించానని టీజీ వెంకటేష్ అన్నారు. అలాగే తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా క్రీడల అభివృద్ధికి ఎంతగానో నిధులు వెచ్చించినట్టుగా ఆయన తెలిపారు. గతంలో సరైన వాటర్ ట్రీట్మెంట్ లేక ఎక్కువ మరణాలు సంభవించటం జరిగేదని అని, అలా కాకుండా ఎప్పటికప్పుడు నీటిని శుద్ధపరుస్తూ ఎటువంటి చర్మవ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను టీజీ వెంకటేష్ కోరారు. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు కర్నూలు కేంద్ర కావడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య, నేషనల్ అథ్లెటిక్స్ స్విమర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి, సురేంద్ర, సందడి సుధాకర్, రిటైర్డ్ డిఎస్పి రామ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.