రైతుల ఆర్థిక పురోగమనానికి (PMKSK)” దోహదపడుతున్నాయి..
1 min read– వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవలు, ఉత్పత్తులు ఒకే చోట లభ్యమయ్యే “ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు.
– “మీడియా టూర్” లో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరులోని ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని సందర్మనం..
పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవలు, ఉత్పత్తులు ఒకే చోట లభ్యమయ్యేలా “ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను (PMKSK)” రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆగస్టు 2022లో ప్రారంభించిందని కోరమాండల్ సంస్థ సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు రీజనల్ బిజినెస్ హెడ్ P. భాస్కర రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా కోడుమూరులోని ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రానికి నిర్వహించిన “మీడియా టూర్” సందర్భంగా ఆయన విలేఖర్లను ఉద్దేశించి మాట్లాడారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తమ గ్రోమోర్ బ్రాండ్ ద్వారా గత ఆరు దశాబ్దాలుగా రైతులకు నాణ్యమైన ఎరువులు మరియు ఇతర వ్యవసాయత్పత్తులు అందిస్తోందని.. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తమ డీలర్ల సమన్వయంతో దేశ వ్యాప్తంగా కోరమాండల్ సంస్థ 12000 కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ఇందులో 4500 కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఏర్పాటయ్యాయని కోడుమూరులోని ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం ద్వారా కోరమాండల్ సంస్థ డ్రోన్ల కస్టమ్ హైరింగ్ చెప్పారు. మట్టి పరీక్షలు, సస్య రక్షణ సలహాలు ఇత్యాది సేవలను రైతులకు అందిస్తోందని తెలిపారు. రైతులకు శ్రేష్టమైన ఎరువులను, సూక్ష్మ పోషకాలను మరియు సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో అందించడం ద్వారా రైతుల ఆర్థిక పురోగమనానికి ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. సమీకృత పోషక నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ.. నాణ్యమైన ఎరువులతో పాటు భూసార పరీక్ష, వ్యవసాయ విస్తరణ వంటి సేవలను PMKSK కేంద్రాల ద్వారా వినియోగించుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో కోరమాండల్ సంస్థ జోనల్ మేనేజర్ గోవిందరావు, డివిజనల్ అగ్రానమిస్ట్ సుధాకర్ రెడ్డి, సంస్థ సిబ్బంది మరియు శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ డీలర్ శ్రీ అశోకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.