NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాత్రికేయుల సహకారం..చిరస్మరణీయం..

1 min read

విజయవాడ:సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పాత్రికేయ మిత్రులు అందించిన సహకారం మరువలేనని ఉయ్యూరు సి .డి. సి. చైర్మన్ రాజులపాటి రామచంద్రరావు అన్నారు. ఉయ్యూరు చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నాయకులు రాజులపాటి రామచంద్రరావు ను ఆయన కార్యాలయంలో శనివారం ఉదయం ఉయ్యూరులో తొలితరం సీనియర్ పాత్రికేయులు ఏ.బి.ఎన్. ఛానల్ పి.ఆర్.ఓ. … కె.ఎస్.రాజు (విలేకరి రాజు) మర్యాద పూర్వకంగా కలిశారు. కుటుంబ ఆత్మీయులుగా భావించే తన మిత్రునికి పదవి వచ్చిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ రాజులపాటి రామచంద్రరావును విలేకరి రాజు సత్కరించారు. ఇదే సందర్భంగా అక్కడికి విచ్చేసిన ఉయ్యూరులో తొలితరం సీనియర్ పాత్రికేయులలో ఒకరైన చొప్పరపు సాంబశివ నాయుడు తో కలసి రాజులపాటిని సత్కరించడం జరిగింది.మూడు దశాబ్దాల క్రితమే తన రాజకీయ జీవితంలో స్థానిక పాత్రికేయులుగా సహకారం అందించిన విలేకరి రాజు , చొప్పరపు సాంబశివ నాయుడు ను సి.డి.సి. చైర్మన్ రాజులపాటి రామచంద్రరావు  ఆత్మీయంగా సత్కరించారు.  విలేకరి రాజు తోపాటు ఆయన సతీమణి విజయలక్ష్మి ని సత్కరించటం జరిగింది.కార్యక్రమంలో 17 వ వార్డు కౌన్సిలర్ రాజులపాటి నాగేంద్రప్రసాద్(చిన్ని), బహుజన సాహిత్య అకాడమీ చైర్మన్, మాజీ సర్పంచ్ జంపాన శ్రీనివాస్ గౌడ్ , వైఎస్సార్ సిపి నాయకులు కళాధర్, సామాజిక  కార్యకర్తలు పార్వతి, సిరివెళ్ల గౌరీ తదితరులు పాల్గొన్నారు.

About Author