PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి సహకారం

1 min read

– ప్రముఖ విరాళాల దాత పార విశ్వనాథ్( చిట్టెన్న) 
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ కర్నూలు రోడ్డులోని జర్నలిస్టు కాలనీలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని ప్రముఖ విరాళాల దాత పెరవలి పారా విశ్వనాథ్  చిట్టెన్న అన్నారు.  గత ఆరు నెలల కిందట శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్వాహకులు పెరవలి పారా విశ్వనాథను  కలిసి ఆహ్వానించారు. జర్నలిస్టుల వినతి మేరకు  గురువారం శ్రీ అభయాంజనేయ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అర్చకుడు రవి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారికి రాతి మండపం నిర్మాణానికి తమ వంతు చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రహరీ నిర్మాణం , ఆలయ అభివృద్ధి పనులకు  సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కే లక్ష్మీనారాయణ, రాజేష్ గౌడ్, రాజనారాయణ గుప్త, షేక్షావలి, ఇర్ఫాన్,  పకీరప్ప ,రాముడు, మధుసూదన్ గౌడ్ ,పవన్, రాజగోపాల్, సాలు రంగడు, నాగరాజు, రంగన్న, మళ్లీ,  గోపాల్,  ఓబులేసు, భాష ,తదితరులు పాల్గొన్నారు.

About Author