PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఐ నారాయ‌ణ పై త‌మ‌న్నా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బిగ్ బాస్ షో నిర్వ‌హ‌ణ పై సీపీఐ నాయ‌కుడు నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ అంటూ ఆయ‌న కామెంట్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి మండిపడింది. ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్న ఆమె బిగ్‌బాస్‌ షోను బ్రోతల్‌ హౌస్‌ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. ఈ షో వల్ల తమకు ఎంతో గుర్తింపు, ఉపాధి కలుగుతున్నాయని, ఒకవేళ షో నచ్చకపోతే ఛానెల్‌ మార్చుకోవాలంటూ సలహా ఇచ్చింది.

                                 

About Author