అంబేద్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి !
1 min read
పల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని బర్తరఫ్ చేయాలని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. అవగాహన లేనివారు రాజ్యాంగ పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. పదే పదే అంబేద్కర్ ను అవమానించడం శ్రీదేవి మానుకోవాలని సూచించారు. శ్రీదేవి వైఖరిని జగన్ ఖండించకపోవడం మద్దతు తెలినట్టు భావించాల్సి వస్తోందని అన్నారు. జగజ్జీవన్ రామ్ ను గుర్తుచేసుకోవడం కోసం అంబేద్కర్ ను అవమానించడం సరికాదన్నారు. జగన్ అహంకార ధోరణినే వైసీపీ నేతలు కూడ కొనసాగిస్తున్నారని ఆరోపించారు.