సమ్మక్క-సారక్క పై వ్యాఖ్యల వివాదం.. జీయర్ స్వామి ఏమన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : గతంలో తెలంగాణ గ్రామదేవతలైన సమ్మక్క-సారక్కలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామి స్పందించారు. 20 ఏళ్ల కింద అన్నమాట గురించి వివాదం జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని, గ్రామదేవతల్ని కించపరిచినట్టుగా ఆరోపణలు వచ్చాయని తెలిపారు. తాము ఎప్పుడూ అలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారని తప్పుబట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముస్లిం, క్రిస్టియన్స్ కూడా వస్తుంటారని తెలిపారు. తమకు కులం, మతం అనే తేడా లేదని చెప్పారు. అందరిని గౌరవించాలనేది తమ విధానమని ప్రకటించారు. టీవీ వాళ్లు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అన్నారు.