PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సై శంకర్ నాయక్ సస్పెన్షన్ తో సద్దుమణిగిన వివాదం

1 min read

– ఎస్సై శంకర్ నాయక్ ని సస్పెండ్ చేసిన జిల్లా పోలీస్ అధికారులు
– ఎస్సై అవమానించాడని తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నం
– కొడుకు మృతి.. తల్లి పరిస్థితి విషమం

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలో ఎస్ఐ శంకర్ నాయక్ ను సస్పెండ్ చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రకటించారుబనగానపల్లె పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న శంకర్ నాయక్ ఓ కేసులో పోలీస్ స్టేషన్ కు వచ్చిన తల్లి, కొడుకును ఎస్సై శంకర్ నాయక్ దుర్భసలాడి అవమానించడం తో తల్లి, కొడుకు ఇద్దరూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుమారుడు దస్తగిరి మృతిచెందగా … తల్లి గురమ్మ పరిస్థితి విషమంగా ఉంది…. తల్లి గుర్రమ్మకు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .బనగానపల్లె మండలం చిన్న రాజుపాలెం గ్రామానికి వడ్డే వరలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గురమ్మ , ఆమె కుమారుడు దస్తగిరి రూ.50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చారు…. ఇచ్చిన అప్పు చెల్లించకపోవడంతో పెద్దలు పరిష్కారం చేసి 25 వేల రూపాయలు ఇప్పించారు… మిగిలిన డబ్బు విషయంలో ఇరువురికి మధ్య గొడవ జరిగింది…. దీంతో వడ్డే వరలక్ష్మి బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో గురమ్మ , ఆమె కొడుకు దస్తగిరి పై ఫిర్యాదు చేసింది ఎస్ఐ శంకర్ నాయక్ తల్లి, కొడుకు ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇరువురిని విచారణ చేపట్టాడు… ఈ క్రమంలో వడ్డే వరలక్ష్మి… గురమ్మ, ఆమె కుమారుడు దస్తగిరిలో స్టేషన్ లోనే వాగులాడుకోవడంతో ఈ క్రమంలో గుర్రమ్మ ఆమె కుమారుడు దస్తగిరి ని ఎస్ఐ తీవ్రంగా మందలించాడు దీంతో తల్లి కొడుకు ఇద్దరూ తీవ్ర మనస్థాపానికి గురై నిన్న రాత్రి (శనివారం ) తొమ్మిది గంటలకు పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు…. వీరిని వెంటనే బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దస్తగిరి మృతి చెందాడు తల్లి గురమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మృతుని బంధువులు మృతిచెందిన దస్తగిరి మృత దేహాన్ని హాస్పిటల్ నుంచి భుజంపై మోసుకొని వచ్చి బనగానపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచి మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు బంధువులు.. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకొని బాధితులకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు వెంటనే ఎస్ఐ శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు . ఎస్సై శంకర్ నాయక్ సస్పెండ్ చేయకపోతే చేసేంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించమని స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. హుటాహుటిన బనగానపల్లెకు చేరుకున్న ఇన్చార్జి డిఎస్పి సుధాకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు.ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అతి కష్టం మీద మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని ఒప్పించి మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరికి తరలించారు..పోస్టుమార్టం చేసేందుకు నిరాకరించిన బంధువులు.ఎస్ఐ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకునేంతవరకు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించవద్దని ఆదివారం ఉదయం మృతుడికి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు… పోలీసులు ఎంత బతిమిలాడినప్పటికీ మృతుని బంధువులు ససేమిరా అన్నారు….. దింతో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆసుపత్రి కి చేరుకుని మృతుని బంధువులను ఒప్పించారు …. పోస్టుమార్టం జరిపేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బాధితులను కోరారు.. న్యాయం జరిగేలా చూస్తానని వారికి సూచించారు దీంతో నూతన బంధువులు మృతుని బంధువులు మృత దేహానికి పోస్ట్ మార్టం జరిపేందుకు అంగీకరించారు మృతదేహంతో స్టేషన్ ముందు ధర్నా : దస్తగిరి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మార్చురీ నుంచి నేరుగా మృతదేహంతో స్టేషన్ వద్దకు చేరుకున్నారు మృతుని బంధువులు. మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించారు… దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఎంత సర్ది చెప్పిన మృతుని బంధువులు వినలేదు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని బంధువులకు సంఘీభావం తెలిపారు . ఎస్సై శంకర్ నాయక్ పై చర్యలు తీసుకొని సస్పెన్షన్ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటన చేస్తే పోలీసులకు సహకరిస్తామని అల్టిమట్టం జారీ చేశారు. బనగానపల్లె చేరుకున్న కర్నూల్ రేంజ్ డీఐజీ..ఎస్పీ..బనగానపల్లె లో నేలుకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కర్నూలు జిల్లా రేంజ్ సెంథిల్ కుమార్ . నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి బనగానపల్లెకు చేరుకున్నారు పరిస్థితిని సమీక్షించారు. మృతుని బంధువులు ఎంతకు తగ్గకపోవడంతో రోడ్డుపైనే.

About Author