జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను సమావేశపరచండి- ఆపస్ వినతి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/4-10.jpg?fit=550%2C203&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదికైనా జాయిట్ స్టాప్ కౌన్సిల్ ను ప్రభుత్వం వచ్చి 8 నెలలుగా వస్తున్నఇంతవరకు సమావేశపరచక పోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వాధ్యక్షుడు మరియు సంఘటన కార్యదర్శి సిహెచ్. శ్రావణ కుమార్ అన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాలలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పై ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు ప్రస్తుతం ఉద్యోగులకు రావలసిన ఆర్థిక బకాయిలైన పిఎఫ్ ఏపీజిఎల్ఐ సంపాది సెలవు తదితరు బెనిఫిట్స్ అన్నీ కూడా రావటం లేదని, వాటిని స్ట్రీమ్ లైన్ చేసి వెంటనే వచ్చేటట్లు చూడాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన కరువు భత్యాలను చెల్లించక పోవడం, ఇంతవరకు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయకపోవడం సరికాదని వెంటనే కరువు భత్యం విడుదల చేసి, 30 శాతం ఐ ఆర్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బదిలీ విధా విధానాల్లో ప్రభుత్వం చెబుతున్న వాటికి సంఘాలు చెప్తున్న వాటికి పొంతన రావడంలేదని మూడు నాలుగు కిలోమీటర్లు ఉన్న పాఠశాలను కూడా విలీనం చేయాలని చూడడం సరికాదని అన్నారు. రాష్ట్ర సహ కోశాధికారి ఏ .కృష్ణార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియ కు సంబంధించిన ఖాళీలను ప్రకటించాలని, బదిలీల విధివిధానాలను ప్రకటించాలని కోరారు. రెండు జిల్లాలలో ఆపస్ బలోపేతానికి చేస్తున్న కృషిని తెలిపారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎం నాగ స్వామి నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలపై స్పందించకపోతే తగిన కార్యాచరణతో ముందుకెళతామని ఉద్యోగ , ఉపాధ్యాయుల ఐక్యతను కూడగట్టి పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు కర్నూలు నంద్యాల జిల్లా బాధ్యులు రామకృష్ణ, జేవీఆర్ శెట్టి, వెంకటేశ్వర్లు శ్రీపతి, సుధాకర్ మల్లికార్జున్ , జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/41-2.jpg?resize=550%2C368&ssl=1)