వంట ఏజెన్సీలను రద్దు చేయాలి:ఏఐఎస్ఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మిడుతూరు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ బాలికల హాస్టల్ లోని విద్యార్థినిలకు నాసిరకమైన భోజనం తయారుచేస్తున్న వంట ఏజెన్సీ ని తొలగించి, కొత్త వంట ఏజెన్సీ కి అనుమతి ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహానంది సంబంధిత అధికారుల డిమాండ్ చేశారు.స్థానిక సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక మిడుతూరు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ బాలికల హాస్టల్ను ఏఐఎస్ఎఫ్ తాలూకా సమితి నాయకులు దినేష్ వినోద్ అధ్యక్షతన తనిఖీ చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల హాస్టల్ లో వంట ఏజెన్సీని తొలగించి కొత్తవారిని నియమించాలని వారు అన్నారు అయితే దాదాపుగా హాస్టల్లో 50 మంది పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ విద్యార్థులకు రుచికరం లేని భోజనము ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల అక్కడ హాస్టల్ లో ఉన్నటువంటి విద్యార్థినిలు చాలీచాలని భోజనం చేస్తూ అర్ధాకలితో అలమటిస్తు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అలాగే నీటి కొరత ఎక్కువగా ఉంది కనీసం కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి అక్కడున్న సమస్యను పరిష్కరించాలని వారన్నారు లేనిపక్షంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.