దిగిరానున్న వంట నూనె ధరలు !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో సోయా, సన్‌ఫ్లవర్ వంట నూనెల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. రెండేళ్ల పాటు ఏటా 20 లక్షల టన్నుల పరిమితికి లోబడి.. ఈ రెండు వంట నూనెలను ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే దిగుమతి చేసుకునే క్రూడ్ సోయా, సన్‌ఫ్లవర్ నూనెలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అగ్రికల్చర్ సెస్ పేరుతో విధిస్తున్న 5 శాతం ప్రత్యేక సెస్ కూడా ఈ రెండు ముడి వంట నూనెలకు వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం శుద్ధి చేయని సోయా, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతిపై 5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు.