కాంక్రీట్ మిక్సర్ తో వంట.. 2 లక్షల మందికి భోజనం !
1 min readపల్లెవెలుగు వెబ్:మధ్యప్రదేశ్ లోని మోరెన్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చంబల్ ప్రాంతంలోని మౌనీ బాబా ఆశ్రమంలో నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో కాంక్రీట్ మిక్సర్ తో పిండివంట తయారు చేశారు. భగవత్ కథా చివరి రోజున పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. దీంతో వారందరికీ వంట చేసేందుకు కాంక్రీట్ మిక్సర్ ఉపయోగించారు. మల్పువా మిఠాయి తయారీ చేయడానికి కాంక్రీట్ మిక్సర్ లో పిండివేసి తయారు చేశారు. రెండు లక్షల మందికి పైగా భక్తులు భోజనానికి హాజరుకావడంతో.. వారందరికీ సరఫరా చేయడానికి సరిపడా వంటపాత్రలు లేనిపక్షంలో కాంక్రీట్ మిక్సర్ ఉపయోగించినట్టు నిర్వాహకులు తెలిపారు.