సోనియా గాంధీకి మళ్లీ కరోన !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిరిగి కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్‌లో ఉన్నారు. ”శనివారంనాడు వైద్య పరీక్షల్లో సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఆమె ఐసొలేషన్‌లో ఉన్నారు” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఇవాళ ఒక ట్వీట్‌లో తెలిపారు. సోనియాగాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా ఈ వారం ప్రారంభంలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది.