PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిమాలయాల్లో కరోన నిరోధించే మొక్క .. !

1 min read

పల్లెవెలుగువెబ్ : మండీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, ఢిల్లీలోని ఐసీజీఈబీ సంయుక్త పరిశోధనల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనను నిరోధించి ఫైటో కెమికల్స్ హిమాలయాల్లో పెరిగే ఓ మొక్కలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. హిమాలయాల్లోని రోడో డెండ్రాన్ అర్బోరియం అనే మొక్క పూరేకుల్లో కరోన చికిత్సలో ఉపయోగించే ఫైటో కెమికల్స్ ఉన్నట్టు గుర్తించారు. స్థానికంగా ఈ మొక్కను బురాన్ష్ గా పిలుస్తారు. ఫైటో కెమికల్స్ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ విషయం బయోమాలిక్యులార్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ జర్నల్ లో ఇటీవలే ప్రచురితమైంది.

           

About Author