PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రోన దెబ్బ.. వెయ్యి కేజీల‌ బంగారం వేలం..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన మ‌హ‌మ్మారి సామాన్యుల బ‌తుకుల్లో నిప్పులు పోసింది. కుటుంబాల్లో ఆర‌ని చితిని వెలిగించింది. ఆర్థికంగా, సామాజికంగా తీవ్రమైన న‌ష్టాన్ని మిగిల్చింది. లాక్ డౌన్ నేప‌థ్యంలో కుటుంబాల్లోని బంగారాన్నంతా బ్యాంకులు, గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థల్లో సామాన్యులు తాక‌ట్టు పెట్టారు. బంగారం మీద 90 శాతం రుణం ఇచ్చేందుకు ఆర్బీఐ కూడ అనుమ‌తి ఇచ్చింది. దీంతో కోట్లాది కుటుంబాలు ఎన్నడూలేనంత‌గా బ్యాంకుల్లో బంగారాన్ని తాక‌ట్టు పెట్టారు. మొద‌టి ద‌శ‌తో అంత‌మ‌వుతుంద‌న్న క‌రోన‌.. రెండో ద‌శ‌లో కూడ భారీ దెబ్బతీసింది. ఈ నేప‌థ్యంలో అనేక మంది త‌న‌ఖా పెట్టిన బంగారాన్ని తిరిగి తెచ్చుకోలేని దుస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే బ్యాంకులు, గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థల వ‌ద్ద భారీగా బంగారం పోగయ్యింది. తాక‌ట్టు పెట్టిన వారు గ‌డువు ముగిసేలోపు బంగారాన్ని తిరిగి విడిపించుకోలేదు. ఈ సంద‌ర్భంగా బ్యాంకులు , ఎన్ బిఎఫ్ సి లు బంగారాన్ని వేలం వేశాయి. పోయిన త్రైమాసికంలో మ‌ణ‌ప్పురం ఫైనాన్స్ సంస్థ 404 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేసింది. గ‌త మూడు త్రైమాసికాల్లో కేవ‌లం 8 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేస్తే.. లాక్ డౌన్ తర్వాత దాదాపు 404 కోట్ల విలువైన 1000 కేజీల బంగారాన్ని వేలం వేసింది. దీని ద్వార ప్రజ‌లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అర్థం అవుతోంది.

About Author