కరోన ఉధృతి.. ఆ నగరం మూసివేశారు !
1 min read
China map. China flag. Vector illustration.
పల్లెవెలుగు వెబ్ : కరోన వైరస్ మరోసారి చైనాను వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా తిరిగి విజృంభిస్తోంది. మొత్తం 17 ప్రావిన్సుల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారిన.. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఝాంగ్ జియాజీ నగరాన్ని పూర్తీగా మూసేశారు. ప్రజలెవరినీ ఇంటి నుంచి బయటికి రావొద్దని హెచ్చరిక జారీ చేసింది. పర్యాటకులు నగరాన్ని వదిలివెళ్లొద్దని ఆదేశించింది. వైరస్ కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను శిక్షించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది.