PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే క‌రోన కేసులు ఎక్కువ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన క‌ట్టడి విష‌యంలో కేంద్ర ప్రభుత్వం దార‌ణంగా వ్యవ‌హ‌రించిందంటూ కాంగ్రెస్ విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రం పై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ ఎక్కడ మంచి చేసినా.. దానిని అడ్డుకునే ప‌నిలో రాహుల్ గాంధీ ఉన్నాడ‌ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమ‌ర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే క‌రోన కేసులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి సంకోచిస్తున్నార‌ని దుయ్యబ‌ట్టారు. ఎక్కువ మ‌ర‌ణాలు , పాజిటివిటీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఉంద‌ని సంబిత్ విమ‌ర్శించారు. శ్వేత‌పత్రాలు విడ‌దుల చేసే బ‌దులు.. ఆయా రాష్ట్ర్రాల‌కు వెళ్లాల‌ని రాహుల్ కు బీజేపీ నేత సంబిత్ సూచించారు. రాజ‌స్థాన్, చ‌త్తీస్ఘడ్ లో వ్యాక్సిన్లు వృథా అవుతున్న తీరును క్షేత్ర స్థాయికి వెళ్లి ప‌రిశీలించాల‌ని రాహుల్ గాంధీకి హిత‌వు ప‌లికారు.

About Author