PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రికార్డు స్థాయిలో క‌రోన కేసులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రోన వైర‌స్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బెంగ‌ళూరులో బుధ‌వారం ఒక్క‌రోజే 15,617 కొత్త కేసులు న‌మోదైన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మంగళవారం నగరంలో నమోదైన 10,800 కేసుల కంటే 44శాతం ఎక్కువ అని ప్ర‌భుత్వం తెలిపింది. కొత్త కేసులతో నగరంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 73,000 చేరుకుంది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ ట్విట్టర్‌లో తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఈ రోజు కరోనా వైరస్ వల్ల రాష్ట్ర రాజధానిలో కూడా 6 మరణాలు సంభవించాయని మంత్రి తెలిపారు.

                                          

About Author