NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌దివేలు దాటిన క‌రోన కేసులు: అల‌ర్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి ప‌దివేల క‌రోన కేసులు న‌మోదు కావ‌డం ప్రజ‌ల్లో ఆందోళ‌న రేకిత్తిస్తోంది. మొద‌టి ద‌శతో పోల్చుకుంటే.. రెండో ద‌శ‌లో క‌రోన దాడి త్రీవంగా ఉంది. క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉండ‌టంలేదు. ఆక్సిజ‌న్ కొర‌త వేధిస్తోంది. మ‌రోవైపు డాక్టర్లకు, వైద్యసిబ్బందికి క‌రోన సోక‌డంతో డాక్టర్ల కొర‌తతో ఆస్పత్రులు ఇబ్బందిప‌డుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే భార‌త‌దేశంలో ఒక హెల్త్ ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోంది. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప‌రిస్థితి క్షేత్రస్థాయిలో నెల‌కొంది. క‌రోన కేసులు వివ‌రాలు వైద్య ఆరోగ్య శాఖ విడుద‌ల చేసింది. గ‌త 24గంట‌ల్లో 41,871 మందిని ప‌రీక్షించ‌గా.. 10,759 కేసులు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

About Author