కరోన మందు.. ఆనందయ్యకు నోటీసులు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు మందు ఉందంటూ ప్రచారం చేస్తున్న వారి పై ఆయుష్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్యకు నోటీసులు జారీ చేసింది. ఆనందయ్య తన మందు పై ఇప్పటికీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని ఆయుష్ శాఖ కమీషనర్ రాములు తెలిపారు. ు. ఆనందయ్య మందుపై కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనే ప్రభుత్వం పది రోజుల వ్యవధిలో వేగంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ కోవిడ్ నివారణకు సూచించిన అన్ని ఆయుర్వేదం, హోమియో మందులు అన్ని డిస్పెన్సరీలలో అందుబాటులో ఉంచామని చెప్పారు.