కరోన భయం… భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ సూచీలను కరోన భయం మరోసారి వెంటాడుతోంది. దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ఇన్వెస్టర్లలో భయానికి కారణమైంది. ఇప్పటికే యూరప్, అమెరికాలో కరోన కేసులు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. బుల్ రన్ కు బేర్స్ బ్రేక్ వేశాయని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణం భయాలకు, కొత్త వేరియంట్ తోడవ్వడంతో సూచీలు భారీ ఎత్తున్న నష్టాన్ని చవిచూస్తున్నాయి. ప్రధాన షేర్లు భారీగా కరెక్షన్ కు గురయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 1471 పాయింట్ల నష్టంతో 57323 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 464 పాయింట్ల నష్టంతో 17071 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1226 పాయింట్ల నష్టంతో 36138 వద్ద ట్రేడ్ అవుతోంది. యూరోపియన్ మార్కెట్లు సైతం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.