పార్లమెంట్ లో కరోన.. 400 మందికి పాజిటివ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : పార్లమెంట్ లో కరోన విజృంభిస్తోంది. త్వరలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. పెద్దఎత్తున కరోన బారినపడ్డట్టు తెలుస్తోంది. మొత్తం 400 మందికి కరోన పాజిటివ్ గా తేలినట్టు వెల్లడైంది. ఈ నెల 4-8వ తేదీ ల మధ్య 1,409 మందికి టెస్టులు చేశారు. వైరస్ నిర్ధారణ అయినవారిలో 200 మంది లోక్‌సభ సచివాలయ సిబ్బంది కాగా, 65 మంది రాజ్యసభ సచివాలయ ఉద్యోగులు. అనుబంధ కార్యాలయాలకు చెందిన మరో 133 మందికీ కొవిడ్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు, ఉద్యోగుల హాజరుపై పరిమితులు విధించారు. రాజ్యసభ సచివాలయంలోని కార్యదర్శి దిగువ స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఈ నెల చివరి వరకు ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పరిస్థితిని సమీక్షించారు.