గర్భిణులకు కరోన సోకిన.. శిశువు క్షేమమే !
1 min readపల్లెవెలుగువెబ్ : గర్భిణులకు కరోన సోకితే శిశువుకు సోకుతుందా ?. ప్రసవం తర్వాత సోకితే పాలుతాగే పిల్లలు కూడ కరోన బారినపడతారా ? అన్న సందేహాలు అందరిలోను ఉన్నాయి. అయితే గర్భిణులకు కరోన సోకినా శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించి నివేదిక ఓ జర్నల్ లో ప్రచురితమైంది. కరోన సోకిన గర్భిణులకు జన్మించిన శిశువుల్లో కరోన జాడలేదని , శిశువు ఆరోగ్యం.. పెరుగుదల సాధారణంగానే ఉందని పరిశోధకలు స్పష్టం చేశారు. ఇందుకోసం వ్యాక్సిన్ వేసుకోక ముందు కరోన బారిన పడిన గర్భిణులపై ఆరు నెలలపాటు అధ్యయనం చేశారు. వారికి జన్మించిన శిశువులకు ఎవరికీ కరోన సోకలేదని పరిశోధనలో తేలింది. కరోన మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ఇదొక ఊరటనిచ్చే అంశమని జర్నల్ సీనియర్ రచయిత, డాక్టర్ మల్లికా షా తెలిపారు.