కరోన.. పాఠశాలలకు సెలవు ఇవ్వడం సరైంది కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం సరైంది కాదని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ జైమే సావేడ్ర తెలిపారు. కొత్త వేవ్ లు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివరి నిర్ణయం కావాలన్నారు. పాఠశాలలను పునఃప్రారంభించడం వల్ల కరోనా వైరస్ కేసులు పెరిగాయని, పాఠశాలలు సురక్షిత ప్రదేశాలు కాదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావేడ్ర మాట్లాడుతూ, బాలలకు టీకాలు ఇచ్చే వరకు వేచి చూడాలనడంలో అర్థం లేదని చెప్పారు. ఈ దృక్పథానికి సైన్స్‌పరమైన ఆధారమేదీ లేదన్నారు. పాఠశాలలను తెరవడం, కరోనా వైరస్ వ్యాపించడం మధ్య సంబంధం లేదన్నారు.