తెలంగాణలో కరోన కలవరం
1 min readతెలంగాణలో కరోన కలవరం మొదలైంది. కొత్తగా 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనతో నిన్న ఒకరు మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోట్ విడుదల చేసింది. మరోవైపు కరోన బారి నుంచి 161 కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 1873 కరోన యాక్టివ్ కేసులున్నాయని, 733 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపింది. కేవలం జీహెచ్ఎంసీలోనే 44 కొత్త కరోన పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.