NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాన్ అబ్ర‌హంకు క‌రోన పాజిటివ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు జాన్ అబ్ర‌హాం కు క‌రోన పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. జాన్ అబ్ర‌హాం సతీమ‌ణి ప్రియాకు కూడ కరోన పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జాన్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘మూడ్రోజుల క్రితం నేనొక వ్యక్తిని కలిశాను. అతడికి కరోనా పాజిటివ్ అని ఆ తర్వాత తెలిసింది. అప్పటి నుంచి నేను, నా భార్య ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాం. స్వల్ప లక్షణాలుండటంతో పరీక్షలు చేయించుకోగా మా ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేమిద్దరం వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా బారినపడ్డాం. కాబట్టి కరోనాని సాధారణంగా తీసుకోవద్దు. మాస్కులు ధరించండి. ఆరోగ్యంగా జీవించండి’’ అని జాన్‌ తెలిపారు.

                                  

About Author