సింగర్ ఆదిత్య దపంతులకు కరోన పాజిటివ్
1 min readన్యూఢిల్లీ: సింగర్ ఆదిత్య నారయణ్, అతని భార్య ..నటి శ్వేత అగర్వాల్ కు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆదిత్య నారాయణ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్టు ఆదిత్య తెలిపారు. వైద్య సలహాలు పాటిస్తున్నామని.. తమను కలిసిన వాళ్లు కూడ కోవిడ్ టెస్ట్ చేయించుకుని .. హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కోరారు. ప్రోటోకాల్ ను ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. ఇటీవల డిసెంబర్ లో వీరద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇంతలోనే కరోన బారినపడటంతో అభిమానుల్లో ఒకింత ఆందోళనకు గురిచేసింది.