NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సోనుసూద్ కు క‌రోన పాజిటివ్: భ‌య‌ప‌డ‌కండి అంటూ ట్వీట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: న‌టుడు సోనూసూద్ కు క‌రోన సోకింది. వైద్య ప‌రీక్షల్లో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్టర్ లో ఈ విష‌యం పోస్ట్ చేశారు. కొన్న రోజులుగా క‌రోన ల‌క్షణాల‌తో బాధ‌ప‌డుతుండ‌టంతో ఆయ‌న వైద్య ప‌రీక్షలు చేయించుకున్నారు. వైద్య ప‌రీక్షల అనంత‌రం కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. వైద్యులు సూచ‌న మేర‌కు చికిత్స తీసుకుంటున్నారు. త‌న‌కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని ఎవ‌రూ బాధ‌ప‌డ‌వ‌ద్దంటూ ట్వీట్ చేశారు. మ‌రింత మంది కోవిడ్ బాధితుల‌కు సేవ చేసేందుకు ఇదొక అవ‌కాశంగా తీసుకుంటాన‌ని అన్నారు. లాక్ డౌన్ సంద‌ర్బంగా వ‌ల‌స కూలీల కోసం అనేక సేవ‌ల్ని చేశారు సోనుసూద్. కోట్ల రూపాయలు వ‌ల‌స కూలీల‌ను సొంతూళ్ల‌కు పంపేందుకు ఆయ‌న ఖ‌ర్చ చేశారు.

About Author