తెలంగాణలో కరోన ఆంక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు బంద్ చేస్తున్నట్టు చెప్పారు. సామూహిక సమావేశాలు రద్దు చేశారు. ఏ విధమైన మత, సామాజిక, సాంస్కృతిక సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పెళ్లిళ్లకు 100 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే స్మశానంలోకి అనుమతి ఉందని స్పష్టం చేశారు.