NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘బాదేపల్లి’లో కరోన ప్రత్యేక వార్డు

1 min read
బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ను పరిశీలిస్తున్న కలెక్టర్​ ఎస్​. వెంకటరావు

బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ను పరిశీలిస్తున్న కలెక్టర్​ ఎస్​. వెంకటరావు

– కలెక్టర్​ ఎస్​. వెంకటరావు
పల్లెవెలుగు వెబ్​, జడ్చర్ల: నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కోవిడ్ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట రావు వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 25 నుండి 30 పడకలను ఆక్సిజన్ తో సహా కోవిడ్ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇక్కడ రెండు వార్డులను ప్రత్యేక కోవిడ్​ కోసం ఏర్పాటు చేసి, మిగిలినవి ఇతర రోగుల కోసం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన డాక్టర్లు, సిబ్బంది ,ముఖ్యంగా పల్మనాలజిస్ట్ పోస్టులకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ వెంట బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటిండెంట్ డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ శివ కాంత్ ,జిల్లా మలేరియా అధికారి విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సునీత ,తాసిల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

About Author