మెక్సికోలో కరోన మూడోదశ.. ప్రకటించిన ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ : మెక్సికో దేశంలో కరోన మూడో దశ ప్రారంభమైందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతవారం నమోదైన కరోన కేసుల కంటే 29 శాతం అధికంగా కరోన కేసులు నమోదయినట్లు తెలిపింది. ఈ పెరుగుదల గత ఏడాది రెండో దశతో పోలిస్తే.. చాలా అధికమని ఆరోగ్యశాఖ తెలిపింది. మెక్సికోలో మూడోదశ ఆగస్టులో గరిష్ఠ స్థాయిని చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. థర్డ్ వేవ్ ప్రభావం యువకులపై అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపినట్టు మెక్సికో దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మానుయెల్ లోపెజ్ తెలిపారు. పలురాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్నాయని, బాధితుల్లో యువతే ఉన్నారని అన్నారు. రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల మరణాలు సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. గత ఏడాది నుంచి టీకాలు అందిస్తున్నామని, మరణాలు తక్కువగా ఉండటానికి ఇది కూడ కారణమని తెలిపారు.