NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచం పై మ‌ళ్లీ పంజా విసురుతోన్న క‌రోన‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన వైర‌స్ మ‌ళ్లీ ప్రపంచం పై పంజా విసురుతోంది. ప‌లుదేశాల్లో మ‌ళ్లీ క‌రోన కేసులు పెరుగుతున్నాయి. మ‌ర‌ణాలు కూడ క్రమంగా పెరుగుతున్నాయి. బ్రిట‌న్ లో సుమారు 50 వేల కొత్త కేసులు న‌మోదయ్యాయి. ర‌ష్యా, ఉక్రెయిన్, రుమేనియాలో కోవిడ్ తీవ్రత ఎక్కువ‌గా ఉంది. చైనాలోను క‌రోన మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం సృష్టిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు క‌ఠినతరం చేస్తోంది. ప్రజ‌ల‌కు పూర్తీ స్థాయిలో వ్యాక్సిన్లు అంద‌క‌పోవ‌డం, క‌రోన కొత్త వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అంటున్నారు. ర‌ష్యాలో క‌రోన కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేశారు. వైర‌స్ తీవ్రత అధికంగా ఉన్నచోట లాక్ డౌన్ ఆంక్షలు అమ‌లు చేసే అవ‌కాశం ఉంటుంది.

About Author