500 మంది వైద్యులకు కరోన…!
1 min readపల్లెవెలుగు వెబ్: బీహార్ లో కరోన విళయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. కరోన కట్టడిలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది సైతం కరోన బారినపడి విలవిలలాడుతున్నారు. తాజాగా బీహార్ లోని రెండు ప్రధాన ఆస్పత్రుల్లో 500 మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బంది కరోన బారిన పడ్డారు. పట్నా మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ ఆస్పత్రుల్లో 500 మందికి పైగా కరోన పాజిటివ్ వచ్చినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ లో 384 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కరోన సోకగా.. పట్నా మెడికల్ కాలేజీలో 75 మంది వైద్యులు, 125 మంది వైద్య సిబ్బందికి కరోన సోకింది. దీంతో వీరందరినీ ప్రత్యేక ప్రాంతంలో చికిత్స అందిస్తున్నారు. ఇంతమంది వైద్యులు కరోన బారినపడటంతో ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇతర ఆస్పత్రుల నుంచి వైద్యులను నియమించి కరోన పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు.