మాజీ సీఎం భార్యకు కరోన… సీఎం పరామర్శ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కు కరోన పాజిటివ్ గా తేలింది. ఆమెతో పాటు కుమార్తెకు కూడ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. కానీ అఖిలేష్ యాదవ్ కు మాత్రం కోవిడ్ నిర్దారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయిందని, లక్షణాలు మాత్రం లేవని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. తాను ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు డింపుల్ ప్రకటించారు. అఖిలేష్ కుటుంబ సభ్యులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో యూపీ సీఎం మోగి ఆదిత్యానాథ్ దాస్ ఫోన్ చేసి పరామర్శించారు.