అడవిలో ‘అన్న’ లను వదలని కరోన..?
1 min read
పల్లెవెలుగు వెబ్: కరోన రెండో దశ విజృంభణతో జనారణ్యంలో మరణ మృదంగం మోగిస్తోంది. రోజువారీ కేసులు పెరుగుదల, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు అభయారణ్యంలో కూడ కరోన తిష్ట వేసినట్టు సమాచారం. అడవిలో మావోయిస్టులను కూడ వదలకుండా కాటేస్తోంది. ఆంధ్రా-చత్తీస్ఘడ్ సరిహద్దులో మావోయిస్టలకు కరోన సోకిందని పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వివిధ దళాల్లో పనిచేసే పలువురు మావోయిస్టులు దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తే.. వారికి అవసరమైన చికిత్స అందించి, పునరావాసం కల్పించే బాధ్యత తమదని పోలీసులు చెబుతున్నారు.