పీవీ కూతురికి కరోన
1 min read
హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగరర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ సురభి వాణి దేవికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వార వెల్లడించింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పరీక్ష చేయించుకోవాలని సూచించారు. సురభి వాణి దేవి మాజీ ప్రధాని పీవి నరసింహా రావు కూతురు. ఇటీవలే ఆమె టీఆర్ఎస్ తరపున పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.