టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోన !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కరోన సోకింది. కరోన స్వల్ప లక్షణాలు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కరోన నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న వారు కరోన పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కూడ కరోన సోకిన విషయం తెలిసిందే.