ఆ జిల్లాలో విద్యార్థులకు.. ఉపాధ్యాయులకు కరోన !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలోకి అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలో పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి 17 మంది ఉపాధ్యాయులు, 10 మంది విద్యార్థులు కరోన బారినపడ్డారు. పాఠశాలల్లో కరోన కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో హాజరు శాతం గణనీయంగా పడిపోయింది. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి పాఠశాలల్లో కరోన కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారింది. స్కూళ్ల నిర్వహణ, కొనసాగింపు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది.