కరోనా ఎఫ్టెక్: ఆ రెండు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
1 min read
పల్లెవెలుగు వెబ్: దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,42,73,300కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 14,667 మంది కోలుకోగా, 446 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,58,186కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,59,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 3,36,55,842 మంది కోలుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలో కొత్త కేసుల పాజిటివిటీ రేటులో పెరుగుదల ఆందోళన కల్గిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా పరీక్షలు పెంచాలని, కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.