NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌రోన వ్యాక్సిన్.. పేటీఎం, మేక్ మై ట్రిప్ వెబ్ సైట్స్ లో బుక్ చేసుకోవ‌చ్చు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన వ్యాక్సిన్ బుకింగ్ కోసం కేంద్రం మ‌రింత సులువైన ప‌ద్దతిని ప్రజ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవ‌డం, వ్యాక్సిన్ వేయించుకున్నాక స‌ర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకోవ‌డం ఇక సుల‌భ‌త‌రం అవుతోంది. కోవిన్, ఆరోగ్య సేతు లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ మీద ఒత్తిడి త‌గ్గించ‌డ‌మే కాకుండా.. ప్రజ‌ల‌కు కూడ సులువుగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావ‌డానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం, మేక్ మైట్రిప్ లాంటి ఆన్ లైన్ వెబ్ సైట్స్ తో పాటు ఐసిఐసిఐ లాంబార్డ్, అపోలో హాస్పటల్స్, మాక్స్ హెల్త్ కేర్, రెడ్డీస్ లేబొరేట‌రీస్, ఇన్ఫోసిస్, శివం ఈ కామ‌ర్స్, సిన‌ర్జీ ఇన్ఫో లాంటి సంస్థల ఆన్ లైన్ వేదికల ద్వార వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు.

About Author