స్టాక్ మార్కెట్లో కరెక్షన్.. నష్టాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసాయి. ఉదయం భారీ నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఆ తర్వాత కన్సాలిడేట్ అవతూ.. నష్టాలతో ముగిసాయి. నిఫ్టీ, సెన్సెక్స్ గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో వివిధ రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ సందర్భంగా సోమవారం భారీ నష్టాలతో సూచీలు క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 586 పాయింట్లు నష్టపోయి 52,553 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 165 పాయింట్ల నష్టంతో 15,757 వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 656 పాయింట్ల నష్టంతో 35,095 వద్ద ట్రేడింగ్ ముగించింది.