PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యవసాయ.. కూరగాయల మార్కెట్ లలో అవినీతి – సిపిఐ వినతి

1 min read

అక్రమాలపై తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెట్ శ్రీకాంత్ రెడ్డి వినతి:సిపిఐ

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :  ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కు ప్రత్యేక స్థానం ఉందని,వేరుశనగ ఉత్పత్తుల కొనుగోలుకు పెట్టింది పేరని, అలాంటి గుర్తింపు ఉన్న వ్యవసాయం మార్కెట్ లో కమిషన్  ఏజెంట్లు,దళారీ వ్యవస్థ నేడు అవినీతి, అక్రమాలతో వారి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ, రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని అలాంటి దోపిడీపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో వ్యవసాయం మార్కెట్ కు తనిఖీ కోసం వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ కార్యదర్శి జి రంగన్న, మంత్రాల నియోజవర్గ నాయకులు భాస్కర్ యాదవ్, ఏఐటీయూసీ నాయకులు వీరేషు, పార్టీ ప్రజాసంఘాల నాయకులు మల్లికార్జున గౌడ్,సుంకన్న,చంద్ర, రమేష్ తదితరులు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న మంత్రాలయం సిపిఐ నాయకులు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న విషయంలో  కమిషన్ ఏజెంట్లు, దళారులు తూకాలతో మోసాలు చేస్తూ 2 శాతం కమిషన్ ఉన్నప్పటికీ దాన్ని 4 శాతం వసూలు చేస్తున్నారని, సరుకు కొనుగోలు చేసిన కమిషన్ ఏజెంట్లు వేమన్, హమాలీల చార్జీలు కూడా రైతుల నుండే వసూలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కూరగాయల మార్కెట్ లో బైలా ప్రకారం 4 శాతం కమిషన్ వసూలు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా 10 నుంచి 15% రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుందని, మరియు ఒక వ్యక్తి రెండు మూడు లైసెన్సులు కలిగి ఉండడం, మరి కొంతమంది కమిషన్ ఏజెంట్లను తమ దుకాణాలను ఇతరులకు బాడిగ ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయని కాబట్టి వీటిపై తక్షణమే సమగ్ర విచారణ చేసి ఈ మార్కెట్ ను పట్టిపీడిస్తున్న అవినీతి మహంకారిణి తరిమికొట్టాలని వారు తెలిపారు.

About Author