అవినీతి తప్పేంకాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయనేతలు అవినీతి చేస్తే తప్పేంకాదని అన్నారు. ఆ అవినీకి కొంత పరిధి ఉంటుందంటూ ఆయన చెప్పుకురావడం గమనార్హం. గడిచిన ఎన్నికల్లో చేసిన ఖర్చు, వచ్చే ఎన్నికల్లో చేయాల్సిన ఖర్చులతో పాటు మరికొంత ఖర్చును లెక్కిస్తూ ఇంత వరకు అవినీతి చేయొచ్చంటూ బహిరంగ సభలోనే ఆయన వ్యాఖ్యానించారు. సదరు ఎంపీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.