PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`కోస్తా నా కొడ‌కా`.. రెచ్చిపోయిన శ్రీశైలం ఎమ్మెల్యే డ్రైవ‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి డ్రైవర్‌ శ్రీను బుధవారం రాత్రి హల్‌చల్‌ చేశాడు. వైసీపీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ ఫరూఖ్‌పై ఫోన్‌లో రెచ్చిపోయి మాట్లాడాడు. తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టింగులకు ఫరూఖ్‌ కారణమంటూ దూషణల పర్వం అందుకున్నాడు. ‘బజారులోనే కోస్తా నా కొడకా, నిన్ను ఎవడు కాపాడతాడో చూస్తా, నన్నేమి పీకలేరు. ఉద్యోగం ఊడినా నాకేం కాదు. నేనేంటో చూపిస్తానం’టూ చెప్పలేని బూతులు అందుకున్నాడు. తనకేమీ తెలియదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఫరూక్‌ చెప్పినా వినిపించుకోలేదు.

                                        

About Author