పత్తి రైతులను ఆదుకోవాలి..
1 min readనష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాలు రైతులు పత్తి పంట సాగు చేశారని పంట చేతికి వస్తున్న తరుణంలో అధిక వర్షాల వల్ల కాయలు బుజు పట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని సిపిఐ జిల్లా నాయకులు వి.రఘురాం మూర్తి ఎం.రమేష్ బాబు లు అన్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో సన్న చిన్న కారు రైతులు వేలాది ఎకరాల్లో అధిక పెట్టుబడులు పెట్టి పత్తి పంటను సాగు చేశారని, నాలుగు నెలల తర్వాత అధిక వర్షాల వల్ల నీరు చేరి పంట కాయలు మరుగునపడి చెట్టు కాయలు క్రిందపడ్డాయని, కొన్ని చోట్ల గులాబి రంగు పురుగు తో తీవ్రంగా నష్టపోయారన్నారు. తక్షణమే అధిక వర్షాలతో దెబ్బతిన్న పత్తిపంటను అధికారులు పరిశీలించి దెబ్బతిన్న రైతాంగానికి నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు.