NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగనన్న గోరుముద్ద ” లో రాగి జావ ప్రారంభించిన కౌన్సిలర్ లక్ష్మమ్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనీ 21వ వార్డులో వెంగలరెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నాడు విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేయడం జరిగింది . ముఖ్యమంత్రి జగనన్న గోరు ముద్ద లో భాగంగా నేటి నుండి అదనంగా చిన్నారులకు రాగి జావను ఇవ్వనున్నట్లుగా కౌన్సిలర్ బోయ లక్ష్మమ్మ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం లో ఇప్పటికే సమూల మార్పు చేసి జగనన్న గోరు ముద్ద ద్వారా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన , మెరుగైన , రుచికరమైన, నాణ్యమైన పౌస్టి కాహారం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం అభినందనీయమన్నారు. ఇప్పటికే వారానికి 15 వెరైటీలను ఐదు రోజుల పాటు గుడ్డు , 3 రోజులు చిక్కి , ఇకపై 3 రోజులు రాగిజావా కూడా ఇవ్వడం ముఖ్యమంత్రి జగనన్న కే సాధ్యం అని కౌన్సిలర్ బోయ లక్ష్మమ్మ అన్నారు ఈ కార్య క్రమం లో ప్రధానోపాధ్యాయుడు నాయక్ , టీచర్లు , పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

About Author