డియస్సీ 1998 అభ్యర్ధులకు కౌన్సిలింగ్ ప్రక్రియ
1 min read– విద్యాభివృద్ధి విషయంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి
– పోస్టింగ్ ఆర్డర్స్ అందజేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎంపికై మిగిలిన1998 డీఎస్సీ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్ధానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ మీటింగ్ హాలులో కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమానకి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎంపికైన నూతన ఉపాధ్యాయులందరూ కూడా విద్యాభివృద్ధి విషయంలో కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. విద్యార్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి విద్యార్థికి అందించేలా నూతన ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఎంతోకాలం నిరీక్షణ తర్వాత పొందుతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాన్ని సద్విని చేసుకోవాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి రవి సాగర్ మాట్లాడుతూ డియస్సీ 1998 అభ్యర్ధులకు కౌన్సిలింగ్ ప్రారంభించి పోస్టులకు ఎంపిక చేయడం జరిగినదన్నారు. 274 మంది ఉపాధ్యాయులను కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న స్థానాలకు ఎంపిక చేసి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. పోస్టింగ్ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులందరూ గురువారం సంబంధిత పాఠశాలల్లో జాయిన్ కావాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ వారికి డిఇఓ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన విద్యాశాఖ సిబ్బందికి, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు పువ్వుల ఆంజనేయులు మరియు తదితర యూనియన్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అసిస్టెంట్ డైరెక్టర్లు అవదాని, షరీఫ్, ఎంఈఓ సభితి నరసింహమూర్తి కౌన్సిలింగ్ నిర్వహణకు సహకరించారు.