PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్​యూలో… స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ల ఏర్పాటుకు పరిశీలన

1 min read

భవనాలను పరిశీలించిన  జిల్లా కలెక్టర్, ఎస్పీ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  సాధారణ  ఎన్నికలు రానున్న నేపథ్యంలో  ముందస్తు ఏర్పాట్లలో భాగంగా  రాయలసీమ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ల ఏర్పాటు కొరకు భవనాలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన,  ఎస్పీ  కృష్ణ కాంత్ పరిశీలించారు.శుక్రవారం  జిల్లా కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులతో కలిసి  రాయలసీమ యూనివర్సిటీలోని సాంకేతిక శాస్త్ర కళాశాల బ్లాక్, లైఫ్ సైన్స్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్ 4, ఓల్డ్ లైబ్రరీ, నూతన లైబ్రరీ తదితర భవనాలన్నీ కలియ తిరిగి  క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 8 నియోజకవర్గాలకు సంబంధించి  రాయలసీమ యూనివర్సిటీలో  స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్ లు, రిసెప్షన్ సెంటర్ లకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమ యూనివర్సిటీలోని సాంకేతిక శాస్త్ర కళాశాల బ్లాక్, లైఫ్ సైన్స్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్ 4, ఓల్డ్ లైబ్రరీ, నూతన లైబ్రరీ తదితర భవనాల పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తీసి వేయించాలని, లైటింగ్ కూడా బాగా ఉండే విధంగా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.. ముఖ్యంగా 8 నియోజకవర్గాల వారీగా 8 రిసెప్షన్ సెంటర్లు వివిధ బ్లాక్ లలో ఏర్పాటు చేసినప్పుడు ఆయా నియోజకవర్గాల   సిబ్బందికి గందరగోళం లేకుండా ఏ నియోజక వర్గానికి ఏ బ్లాక్, ఏ ప్లోర్ కేటాయించారని సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలన్నారు.. కౌంటింగ్ హాల్ కి 2 ద్వారాలు ఉండే విధంగా చూసుకోవాలని, పోలింగ్ ఏజెంట్స్, ఈవిఎమ్ మెషీన్ లు కలిసిపోకుండా  బ్యారికేడ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు..ఏ రూమ్స్ అసెంబ్లీ కి, ఏ రూం పార్లమెంట్ కు స్ట్రాంగ్ రూం లు, ఎక్కడెక్కడ కౌంటింగ్ హాల్ లు  ఏర్పాటు చేయాలో అధికారులతో చర్చించారు. అలాగే సెక్యూరిటీ పరంగా తీసుకోవలసిన చర్యల గురించి కూడా కలెక్టర్,ఎస్పీ పరిశీలించారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ మధుసూధన రావు, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author